ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పదవ తరగతి పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులకు పిఆర్ ఫౌండేషన్ బాసటగా నిలిచింది. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను అందించారు. ఈ సందర్భంగా పిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెగడ రమేష్ యాదవ్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని, బాగా చదివి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఎల్లవేళల అండగా పిఆర్ ఫౌండేషన్ ఉంటుందని రమేష్ భరోసా కల్పించారు. అనంతరం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్, సలేంద్ర రవి, బద్దిపల్లి స్వామి, మిట్టపల్లి రాజేశం తదీతరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News