Friday, 26 June 2026 01:20:22 AM

నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు భవనాలను పరిశీలించిన సీపీ....

త్వరలోనే నూతన పోలీస్ స్టేషన్ ల ప్రారంభోత్సవం.. పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్

Date : 23 January 2025 02:31 PM Views : 903

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లిలో నూతనంగా మహిళ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎలిగేడు పోలీస్ స్టేషన్ ల ఏర్పాటు భవనాలను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్, పెద్దపల్లి డీసీపీ చేతన, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ తో పాటు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ...పెద్దపల్లి మహిళ పోలీస్ స్టేషన్ కోసం వ్యవసాయ మార్కెట్ లో, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కోసం బంధంపల్లిలో ప్రాథమిక పాఠశాల భవనం ప్రతిపదించడం జరిగిందన్నారు. పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం ఇప్పుడు పోలీస్ స్టేషన్ కొనసాగుతున్న భవనం అదే విదంగా ఎలిగేడు పోలీస్ స్టేషన్ కోసం పాత ఎం.ఆర్ వో కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అట్టి భవనాలు పోలీస్ స్టేషన్ లకు అనుగుణంగా మార్పులు చేస్తూ, పునరుద్దరణ పనులు చేయడం జరుగుతుందన్నారు. దానికి సంబందించి పనులు పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు ఆదేశాలు జారీ చేయడం కోసం సందర్శించినట్లు సీపీ తెలిపారు.ఈ కార్యక్రమం లో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, సుల్తానాబాద్ సీఐ సుబ్బా రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, పెద్దపల్లి ఎస్ఐ లు లక్ష్మణ్ రావు, జూలపల్లి ఎస్ఐ సనత్ కుమార్, సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :