ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ఆన్ లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరి కాలనీలో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే...అర్జీ-3 డివిజన్ ఓసీపీ-2 లోని ప్రైవేట్ ఓబీ కంపెనీలో వేముల వసంత్ కుమార్ (27)లు వాల్వో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లకు అలవాటు పడిన యువకుడు లక్షల రూపాయలను బెట్టింగ్ యాప్ లో పెట్టి అప్పుల పాలయ్యా డు. ఇదే విషయం యువకుడి తండ్రి వేముల రవిశంకర్ కి తెలియడంతో కుమారుడిని మందలించి గత సంవత్సరం డిసెంబర్ నెలలో 4 లక్షల రూపాయల అప్పులను చెల్లించాడు. అయినా కూడా యువకుడు ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ బెట్టింగ్ యాప్ కు బానిస కావడంతో లక్షల రూపాయలు పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. అయితే ఈ విషయం తన తండ్రికి ఇక్కడ తెలుస్తుందో అనే భయంతో తల్లిదండ్రులు ఇద్దరు సుల్తానాబాద్ ఫంక్షన్ కి వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సింగరేణి క్వాటర్ లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Admin
Aakanksha News