Saturday, 26 September 2026 10:04:13 AM

గోదావరిఖని వద్ద రోడ్డు ప్రమాదం...అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బైక్....

ఇద్దరు యువకులకు గాయలు... 108 ద్వారా గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలింపు...

Date : 03 August 2025 06:46 PM Views : 1249

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్ నగర్ పరిధిలోని RG1 వర్క్‌షాప్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఇద్దరు యువకులు KTM బైక్‌పై అత్యంత వేగంగా ప్రయాణిస్తూ రైలు పట్టాల పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి బైక్‌ను అదుపుతప్పి దూసుకెళ్లారు. ఈ ఘటనలో యువకులకు స్వల్ప గాయాలయ్యాయి.ప్రక్కవారే అప్రమత్తమై వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, రెస్క్యూ చేసిన సిబ్బంది ఇద్దరినీ గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, వేగం మించడమే ప్రధాన కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :