Monday, 10 August 2026 01:09:28 PM

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేపడతాం...

Date : 18 April 2025 06:56 PM Views : 446

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని రురల్ : వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరిస్తామని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ పేర్కొన్నారు. మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెంకటాపూర్, అడవిసోమన్ పల్లి, ఖాన్ సాయి పేట్, సిరిపురం, గుంజపడుగు, నాగారం, కన్నాల, విలోచవరం, సూరయ్యపల్లి, కాకర్లపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఆరెంద కేంద్రాన్ని సంఘ డైరెక్టర్ గడ్డం పోచం, మల్లారం కేంద్రాన్ని డైరెక్టర్ పెద్దిరాజు ప్రభాకర్, స్వర్ణపల్లి కేంద్రాన్ని డైరెక్టర్ సిరిమూర్తి ఓదెలు, నాగేపల్లి కేంద్రాన్ని డైరెక్టర్ రావికంటి సతీష్ కుమార్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ రాష్ట్రంలోనే అధిక మొత్తంలో ధాన్యం సేకరిస్తామని, కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూన్నామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సంఘ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్లు ఆకుల రాజబాపు, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మీ-మొండయ్య, ఉడుత మాధవి-పర్వతాలు యాదవ్, దేవళ్ల విజయ్ కుమార్, నాయకులు ఊట్ల అనిల్, మానేం సత్యనారాయణ, కొండ మహేందర్, జనగామ సడువలి, కొటారి బాపు,మండపు మధు, కుడుధుల కోటయ్య, సత్యనారాయణ, మహదేవ్, మాసిరెడ్డి రాజిరెడ్డి, రాజేంద్ర ప్రసాద్, గూడెపు శ్రీనివాస్, తాళ్ళ సత్యనారాయణ, మహేందర్, బెజ్జెంకి మల్లయ్య, బొమ్మ సత్తయ్య, రమేష్, సంఘ కార్యదర్శి మామిడాల ఆశోక్ కుమార్, రైతులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :