Monday, 10 August 2026 05:36:38 PM

టూ వీలర్ మెకానిక్ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఎండి జాఫర్....

Date : 29 July 2025 12:16 PM Views : 605

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఎన్నికలు ఆగస్టు ఒకటవ తేదీన నిర్వహించనున్నారు. గత 20 సంవత్సరాల నుండి మెకానిక్ వృత్తిలో నిమగ్నమై చిన్ననాటి నుండే మెకానిక్ గా జీవనం ప్రారంభించిన ఎండి జాఫర్ వృత్తి నైపుణ్యతలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అందరితో కలుపుగోలుగా ఉంటూ అన్న తమ్మి మామ బాబాయ్ అంటూ సంబోధించడమే జాఫర్ లక్ష్యం అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జాఫర్ టూ వీలర్ మెకానిక్ లో శ్రేయస్సే లక్ష్యంగా బరిలో దిగానని పేర్కొన్నారు. మెకానిక్ ల సంక్షేమం కోసం వారి అభివృద్దే లక్ష్యంగా తనను ఎన్నికల్లో గెలిపిస్తే పని చేస్తానని అన్నారు. ఈ ఎన్నికల్లో కటింగ్ ప్లేయర్ గుర్తు అని ఈ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని తోటి మెకానిక్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నారు.కుల మతాలకు తావులేదు అని ఆయన జీవన ప్రస్థానంలో చాటి చెప్పడమే కాకుండా ఆచరణలో నిరూపించి ముందుకు సాగిపోతున్నారు. తనను ఆగస్టు ఒకటిన జరిగే ఎన్నికల్లో తన మెకానిక్ కుల బాంధవులు దీవించి కట్టింగ్ ప్లేయర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారి శ్రేయసే లక్ష్యంగా వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఎండి జాఫర్ తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :