Sunday, 27 September 2026 05:22:41 AM

15 రోజుల్లో లాభాలవాటను ఇప్పిస్తాం...

ఐఎన్టీయూసీ నాయకులు నరసింహారెడ్డి వెల్లడి

Date : 19 September 2024 02:54 PM Views : 401

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు బాయి బాట కార్యక్రమాన్ని జీడీకే 1 ఇంక్లైన్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, వడ్డేపల్లి దాస్ జిల్లా అధ్యక్షులు K.సదానందం అర్జీ-1 ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో జనగామ రాజేశం ఫిట్ సెక్రటరీ అధ్యక్షతన కార్మికులతో గేట్ మీటింగ్ ను నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జనక్ ప్రసాద్ అండదండలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి ముఖ్యంగా కార్మికుల సొంత ఇంటి కల నెరవేరుస్తామని అన్నారు. అలాగే కార్మికునికి సంబంధించిన పెర్క్స్ పై విధించే ఇన్కమ్ టాక్స్ రద్దు చేయిస్తామని, సింగరేణికి ఈ సంవత్సరం వచ్చిన లాభాలలో వాటాను కార్మికులకు రానున్న 15 రోజులలో అందజేపిస్తామని తెలిపారు. అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కార్మికుల సంక్షేమం కొరకు INTUC ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నాయకులు గడ్డం కృష్ణ, బేబీ శ్రీనివాస్ పీ సమ్మయ్య మల్లి కార్టూన్ మండ రమేష్ గుండేటి శ్రీనివాస్ ఏ శ్రీనివాస్ బూర జగన్ గడ్డం వెంకటేశ్వర్లు టి రాజయ్య టి ఆంజనేయులు కే శంకర్ సిరిపురం నరసయ్య దేవేంద్ర చారి ఆంజనేయులు తదితరులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :