ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం నగరానికి రావాలంటేనే భయాందోళనకు గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక కార్లలో వచ్చే వారు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలో తెలియక అయోమయ పరిస్థితులు నెలకొంటుంటే మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో కనీసం ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరైనా పేషెంట్ ను ఆసుపత్రికి తీసుక వెళ్లాలంటే కూడా చేతులెత్తేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని కళ్యాణ్ నగర్, లక్ష్మీ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్డు మరమ్మత్తులు జరుగుతుండగా ఒక వైపు నుంచి మాత్రమే వాహనాల రాకపోకలు సాగిస్తుండడం మరోవైపు రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. అయితే కొన్ని భారీ వాహనాలు తమ ఇష్టానుసారంగా సమయపాలన లేకుండా వ్యాపార కేంద్రాల్లోకి వస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తలనొప్పిగా మారుతుంది.ట్రాఫిక్ అవస్థలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఎప్పుడు రద్దీగా ఉండే కిరణ వ్యాపార కేంద్రాలైన కళ్యాణ్ నగర్, లక్ష్మీ నగర్ మేదర్ బస్తీ ప్రాంతాలలో రోడ్లపైనే వాహనాలు నీలవడంతో వాహనదారులు నానా ఇక్కట్లు పడుతున్నారు. సాయంత్రం వేళలో ఈ ప్రాంతంలో కొందరు కిరణ వ్యాపారులకు సంబంధించిన లారీలను రోడ్లపైనే నిలిపి ఉంచడంతో వాహనాల రాకపోకలకు, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. కనీసం బాదాచారులు కూడా నడుచుకుంటూ వెళ్లడానికి వీలు లేని పరిస్థితి నెలకొంటుంది. సాయంత్రం వేళల్లో కొంత మంది కిరాణా వ్యాపారుల సరుకుల లారీలను రోడ్లపై నిలిపి దించుతుండడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ట్రాఫిక్ పోలీసుల నిబంధనలను వ్యాపారస్తులు తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపారస్తులు సమయం సందర్భం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా లారీలను నిలిపి సరుకులను దింపుతున్న అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.వ్యాపారస్తులు నడి రోడ్లపైనే భారీ వాహనాలను నిలిపి వేస్తున్న ట్రాఫిక్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇక పండుగల సమయాల్లో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో సైతం భారీ వాహనాలను అటు ఇటు తిప్పుతూ వాహనదారులను, పాదాచారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా ఎన్నిసార్లు వాహనాలను రోడ్లపైనే నిలిపిన ట్రాఫిక్ పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తే చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. గోదావరిఖని ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. నిత్యం ఎక్కడపడితే అక్కడ వాహనాల తనిఖీలను నిర్వహించే అధికారులకు రోడ్డుకు అడ్డంగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ ఇబ్బందులకు గురి చేసే ఈ భారీ వాహనాలు అధికారులకు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు తనిఖీల మీద ఉన్న శ్రద్ధ వాహనదారుల ట్రాఫిక్ సమస్య మీద పట్టింపు లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అడ్డదిడ్డంగా నడిరోడ్డు పైనే లారీల నిలిపివేస్తున్న ట్రాన్స్ పోర్ట్...
ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఓ ట్రాన్స్ పోర్టు కు సంబంధించిన లారీలను నడిరోడ్డుపైనే నిలిపివేస్తూ నిరంతరం ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తున్న ఆ దిశగా చర్యలు తీసుకున్న అధికారులే కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరిఖని ఊర్వశి థియేటర్ సమీపంలోని ఓ ట్రాన్స్ పోర్టు వ్యవహరిస్తున్న తీరు వివాదాలకు నీలయంగా మారుతుంది.ప్రతీ సారి రోడ్డుకు అడ్డంగా లారీలను నిలిపివేస్తూ ఇష్ట రాజ్యాంగా ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తున్న ఒక్కసారైనా సదరు ట్రాన్స్ పోర్టు పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అర్థం కావడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ఇతరుల వాహనాలకు, ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదని వారిపై చట్టప్రకారం చర్యలు అయినా అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలే కనిపించడం లేదు. ఇప్పటికైనా ఈ సమస్యపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Admin
Aakanksha News