ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పార్టీ ఏదైనా పదవితో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో మమేకమై... ప్రజా సమస్యలే ఎజెండగా ఇప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్యక్రమాలను నిర్వహిస్తున్న కందుల సంధ్యారాణి తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటికి కూడా వ్యక్తిగతంగా నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకును సాధించుకున్న నాయకురాలుగా గుర్తింపు పొందాలని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. బిజెపి పార్టీలో చేరిన అతి తక్కువ కాలంలోనే అగ్రనాయకత్వం తన ప్రతిభను సంధ్యారాణి సేవలను గుర్తించి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. అయితే రామగుండం నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా ఇప్పటి వరకు ఎంత మంది పోటీ చేసిన లేని ఓటు బ్యాంకును కందుల సంధ్యారాణి సాధించారని చెప్పడంలో ఇటువంటి అతియోశక్తి లేదనే చెప్పవచ్చు. బిజెపి పార్టీకి రామగుండం నియోజకవర్గంలో ఎప్పుడు లేని ఓటు బ్యాంకును కందుల సంధ్యారాణి తీసుకురావడం పట్ల రామగుండం నియోజకవర్గంలో బిజెపి పార్టీలో కార్యకర్తల్లో, నాయకుల్లో మరింత ఉత్సాహం పెరిగిందనే చెప్పవచ్చు. తనకున్న ప్రతిభ, రామగుండం ప్రజల ఆదరాభిమానాలే బిజెపి పార్టీ బలోపేతానికి నిదర్శనమని పలువురు వాక్యానిస్తున్నారు. రామగుండం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు లేని ఒక ప్రత్యేకతను సంధ్యారాణి గుర్తింపును తీసుకోవచ్చారని పలువురు బహిరంగగానే కొనియాడుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చిన తన కుటుంబ సభ్యుల వలే వారి ఇంటికి వెళ్తూ తన ఆధార అభిమానాలను చూపిస్తూ ప్రతి ఇంటిలో ఒక కుటుంబ సభ్యురాలిగా ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా కందుల సంధ్యారాణి నామినేషన్ వేయడం పట్ల పలువురు నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపి పార్టీ జెండాను రామగుండంలో ఎగురవేయడానికి పూర్తిస్థాయిలో నిత్యం కార్యకర్తలు, నాయకులతో సంసిద్ధమవుతూ ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తున్నారనీ పలువురు పేర్కొంటున్నారు. అయితే అధిష్టాన అక్రమ నాయకత్వం కూడా రామగుండం నియోజకవర్గంలో కందుల సంధ్యారాణి పట్ల సానుకూలంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Reporter
Aakanksha News