Friday, 26 June 2026 01:15:52 AM

నిరుద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తా.... ఆశీర్వదించండి... పనిచేసి చూపిస్తా

పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి

Date : 03 January 2025 07:39 PM Views : 485

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : నిరుద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తనని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆశీర్వదించాలని, పనిచేసి చూపిస్తానని పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మంథని పట్టణం ఎస్ఎల్బి గార్డెన్ లో మంథని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేలా మారుతి అధ్యక్షతన జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్, నిజామాబాద్ ఆదిలాబాద్, కరీంనగర్, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం ముందుగా నరేందర్ రెడ్డి సరస్వతీ దేవికి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు గర్వపడుతున్నానని, పట్టభద్రులకు సేవ చేసుకునేందుకు అవకాశం వచ్చిందని, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పట్టభద్రులు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు నెలకొల్పి 35 సంవత్సరాలు పూర్తయినట్లు ఆయన పేర్కొన్నారు. గత 35 సంవత్సరాలుగా విద్యార్థులకు సేవ చేస్తూ, వారి ఉన్నత జీవితానికి కృషి చేస్తున్నానని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగుల తరఫున గొంతుకనై పని చేస్తానని అయిన పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేలా ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులు అధైర్య పడవద్దు అని, పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థితికి రావాలని ఆయన సూచించారు. పట్టభద్రుల కోసం, నిరుద్యోగుల సంక్షేమ కోసం ఎల్లప్పుడు ముందుంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి నాయకులు అక్కపాక తిరుపతి, బాపు గౌడ్, దహగం శ్రీనివాస్, న్యాయవాదులు సతీష్, అంజన్న, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్, ప్రధాన కార్యదర్శి పోతురాజు సమ్మయ్య, పాత్రికేయులు గడిపెళ్లి అజయ్, మాజీ సర్పంచ్ నారాయణ, విద్యార్థి నాయకులు బెజ్జంకి డిబంగర్, అర్ల సందీప్, చిల్లప్ప గారి సునీల్, ఉపాధ్యాయురాలు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సీనియర్ అధ్యాపకులు లక్ష్మిని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఘనంగా శాలువతో సన్మానించి సత్కరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :