Friday, 26 June 2026 01:16:32 AM

నాయకుల మెప్పు కోసం పని చేస్తే ఆంధ్రప్రదేశ్ లో జరిగిందే.. తెలంగాణలో జరుగుతుంది..మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

సింగరేణి కార్మికులు మరోసారి తమ పోరాట స్ఫూర్తిని చాటాలి...

Date : 06 October 2024 04:59 PM Views : 615

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఎన్నో సమ్మెలు, పోరాటాలు కేసులు అయితే తెలంగాణ వచ్చిందని మరోసారి సింగరేణి కార్మికులు పోరాటానికి సిద్ధం కావాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కార్మికులకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని తెలంగాణ బొగ్గు గని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సింగరేణి నిరాహార దీక్ష కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణిలో కొత్త రకమైన మార్పును కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకవస్తుంది. ఈ మార్పుల వల్ల సింగరేణి సంస్థలో ఆదాయం, లాభాలు పెరగాలి కానీ 32శాతం ఉన్న లాభాల వాటాను 16 శాతనికి తీసుకవచ్చి నిజంగానే మార్పు తీసుకవచ్చారని మాజీ ఎంపీ, బాల్క సుమన్ ఎద్దేవా చేసారు. దీంతో మరో సారి సింగరేణి కార్మికుల్లో చైతన్యం రావాలని పోరాట స్ఫూర్తినీ తెలియజేయలని పిలుపునిచ్చారు. లాభాల వాటపై కార్మికులకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కి కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో అరెస్టులు చేస్తూ అనుమతులు లేవని అడ్డుకుంటున్నారని తెలిపారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మోసం చేసారని అలాగే 2వేల పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఉన్న పెన్షన్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మార్పు... మార్పు... మార్పు అని గద్దెనెక్కి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మార్పు తీసుకవచ్చిందని ప్రభుత్వంపై చురకాలంటించారు. లక్షలది ప్రజల ఇండ్లులు కులకొట్టి మూసీ ప్రాజెక్టు పేరుతో హైదరాబాద్ ను ఏటీఎం సంస్థల ప్రభుత్వం వాడుకుంటుందని ముగ్గురికి మాత్రమే అప్పగించారని ఆరోపించారు. ఉద్యమకారులుగా కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం నిర్వహిస్తూనే ఉంటామని కార్మికుల పక్షాన గొంతువిప్పి మాట్లాడతామని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నాయకులను లాభాల వాటాపై నిలదియాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కనీసం అధికారంలోకి వచ్చిన 10నెలలో సింగరేణిలో ఒక్క కొత్త బొగ్గు బాయిని తీసుకవచ్చారా...? సింగరేణిలో కొత్త ప్రాజెక్టులు ఏమైనా తీసుకవచ్చారా అని ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణి మనుగడ ప్రశ్నర్ధకంగా మారుతుంది.ఎవరో నాయకులు చెప్పినట్టు వింటే ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ అధికారులకు ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలని ఎవరి మెప్పు పొందాడానికో ఇలా చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయని ఆరోపించారు.తెలంగాణ ప్రభుత్వంలో చెరువులను అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో చెరువులను కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగరేణి జీలిటెన్ స్టిక్స్ పెట్టి పెల్చేస్తూన్నారని అసలు వారికి సింగరేణికి సంబందించిన జీలిటెన్ స్టిక్స్ ఎలా వచ్చాయని ఎందుకు దీనిని బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అవాలంబిస్తున్న వ్యతిరేఖ విధానాలు, ప్రజలను మోసం చేస్తున్న విధానం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేసి మన హక్కులను సాధించుకోవాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :