Tuesday, 11 August 2026 02:43:34 PM

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే...

Date : 23 March 2025 03:34 PM Views : 432

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ 148 కళ్యాణ లక్ష్మి, 23 షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అన్ని వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. రామగుండం నియోజకవర్గం ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనలతో కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :