Friday, 26 June 2026 12:23:41 AM

రాష్ట్రంలో రేవంత్ సర్కార్ లాఠీ రాజ్యం నడుస్తోంది...

రాజకీయ కక్షలతోనే కేటీఆర్ పై అక్రమ కేసులు... మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

Date : 20 December 2024 07:12 PM Views : 1374

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రాష్ట్రంలో రేవంత్ సర్కార్ లాఠీ రాజ్యం నడుస్తోందని, రాజకీయ కక్షలతోనే కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీని బద్నామ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని రామగుండం మాజీ శాసన సభ్యులు, పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామిలు నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరాస్తాలోని టిబిజికెఎస్ కార్యాలయం ఆవరణలో రిలే నిరహర దీక్షలు చేపట్టారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ...ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచిందన్నారు.బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై రాజకీయ కక్షలతోనే అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు రేవంత్ సర్కార్ దిగుతుందని అన్నారు. వెంటనే కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేసారు.ఏదో ఒక విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోందని విమర్శించారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు ఎన్ని చేసినా.. ఇలాంటి ఉడత ఊపులకు బెదిరేది లేదన్నారు. రాష్ట్రంలో నడుస్తోంది ప్రజాపాలన కాదని పోలీసు పాలన అన్నారు. ప్రశ్నీస్తే కేసులు.. నిలదిస్తే ఆరెస్ట్ లను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామిలను నేరవేర్చకుండా ప్రజల దృష్టిని మార్చేందుకు కేటీఆర్ పై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు.ఉద్యమాల గడ్డ రామగుండం నుండి రెవంత్ రెడ్డి పాలన పతనం ప్రారభంమైయుందన్నారు. కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసేదాకా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరహర దీక్షలు కోనసాగుతాయని హెచ్చరించారు.రాబోవు కాలంలో ప్రజా కోర్టులో రేవంత్ సర్కారుకి తగిన శాస్తి జరగడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మూల విజయ రెడ్డి, గోపు అయులయ్య యాదవ్, కార్పోరేటర్లు గాధం విజయ, బాదె అంజలి, జనగామ కవిత సరోజిని నాయకులు నారాయణదాసు మారుతి, అచ్చే వేణు బోడ్డు రవీందర్ మేతుకు దేవరాజ్ రాకం వేణు జిట్టవేన ప్రశాంత్ ముదిరాజ్ సట్టు శ్రీనివాస్ తోకల రమేష్ నూతి తిరుపతి సింహచలం రత్నకర్ చెలకలపల్లి శ్రీనివాస్ జక్కుల తిరుపతి నీరటి శ్రీనివాస్ కృష్నస్వామి ఇరుగురాళ్ల శ్రావన్ చింటూ రామరాజు ఆవునూరి వెంకటేష్ ముద్దసాని సంధ్యా రెడ్డి కొడి రామకృష్ణ యాసర్ల తిమెాతి కర్రి ఓదేలు గడ్డం నారాయణ నిట్టూరి రాజు బోయ రాజ్ శేఖర్ నవిత నాగరాజు సారయ్య నాయక్ అల్లి గణేష్ బచ్చాల రాములు కనకలక్ష్మి సరళ రవి కనకయ్య తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :