Friday, 26 June 2026 12:22:09 AM

నియోజకవర్గ అభివృద్ధికి నా వంతుగా సహాయ సహకారాలను అందిస్తా....

ప్రజల కష్టాలు తొలగి... రాష్ట్రం అభివృద్ధి బాటలు నడవాలి... పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Date : 26 February 2025 01:04 PM Views : 676

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / దాట్ల జేమ్స్ రెడ్డి : రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి నా వంతుగా పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని, ప్రజల కష్టాలు తొలగి రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జనగామ గ్రామంలోని శ్రీ లింగేశ్వర రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఎంపీ ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పార్లమెంటు పరిధిలోని ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ ఆయన మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పరమశివుడి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :