Monday, 10 August 2026 01:06:42 PM

మంచిర్యాల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన రామగుండం సీపీ ...

సమన్వయంతో పనిచేసి ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా...

Date : 12 March 2025 07:59 PM Views : 450

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం పోలీస్ కమిషణరేట్ పరిధిలోని మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ను నూతన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేసారు.ముందుగా పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల వివరాలతో పాటు పోలీస్ స్టేషన్ నిర్వహణ, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నేరాల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలు, రౌడీ షీటర్ల బైండోవర్లు, కౌన్సిలింగ్ మొదలైన విషయాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ...పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి పనితీరు గురించి తెలుసుకున్నారు.మొన్న పోలీస్ కమిషనర్ లో సగం భాగానికి పైన మంచిర్యాల జోన్ విస్తరించబడి ఉంది. అందులో మంచిర్యాల పట్టణం కీలకమైన ప్రాంతం ఇక్కడ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కావున శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ విషయంపై అధికారులతో మాట్లాడి ప్రజలకు ఉత్తమైన, పారదర్శకతతో చట్ట బద్దతతో ఉత్తమ సేవలు అందించడంపై చర్చించడం జరిగిందన్నారు. పోలీస్ శాఖ బాధ్యతాయుతంగా ఉంటుందని రాత్రి పెట్రో కార్ సిబ్బందిని తనిఖీ చేసి అలర్ట్ చేసి రామగుండం, గోదావరిఖని ప్రాంతంలో తనిఖీ చేయడం జరిగిందన్నారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పారిశ్రామిక ప్రాంతం ఎక్కువగా ఉందని రాత్రి సమయంలో డ్యూటీలకు వెళ్లే వాళ్లు, ఇతర వ్యాపారం నిమిత్తం బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రజల సేఫ్టీ, సెక్యూరిటీ కొరకు అధికారులు కూడా ప్రతిరోజు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ కి మంచి పేరుందని, అధికారులు సిబ్బంది అందరి సమన్వయంతో మంచి టీమ్ లాగా పని చేస్తూ ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్, పట్టణ ఇన్స్ పెక్టర్ ప్రమోద్, మైలా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కే నరేష్ కుమార్, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :