Saturday, 26 September 2026 05:31:37 AM

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు

Date : 01 March 2025 07:06 PM Views : 727

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / దాట్ల జేమ్స్ రెడ్డి : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరీకాలనీ ఎం జె పి పాఠశాలలోని విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. అలాగే మహిళా సాధికారత కేంద్రం యొక్క అవగాహన బాలికల రక్షణ, విద్య, లింగ నిర్ధారణను నివారించేందుకే ‘బేటీ బచావో.. బేటీ పడావో’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలపై పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు వాటిపై పని చేస్తున్న చట్టాలు, టోల్ ఫ్రీ నెంబర్స్, మహిళలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మొదలైన అంశాలను గురించి అవగాహన కల్పించారు. మహిళలపై పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు వాటిపై పని చేస్తున్న చట్టాలు, మహిళల కోసం పని చేసే సఖి (181) సెంటర్ యొక్క సేవలు, వివాహ నమోదు చట్టం, సోషల్ మీడియా అవగాహన, లింగ సమానత్వం ,టోల్ ఫ్రీ నెంబర్స్, బ్యాంకింగ్ ఉపయోగాలు , స్కాలర్షిప్స్ మరియు మాదకద్రవ్యాల గురించి అవగాహన ,ఉన్నత విద్య మొదలైన అంశాలను గురించి అవగాహన చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యొక్క ప్రిన్సిపాల్ రజిత మరియు అధ్యాపక బృందం , ఫైనాన్షియల్ లిటరసీ సంధ్య, సోషల్ వర్కర్ శ్రీనివాస్, చైల్డ్ లైన్ సూపర్వైజర్ సంతోష్,కమ్యూనికేట్ ఎడ్యుకేటర్స్ శ్యామల మరియు తదితరులు పాల్గోన్నారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :