Friday, 26 June 2026 12:17:17 AM

ముంజ హరీష్ కుటుంబానికి అందని పరిహారం...

వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధం

Date : 07 April 2023 04:24 PM Views : 522

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CPI జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, CPI ML న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె విశ్వనాథ్, CPI ML ప్రజాపంధా జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ లు హాజరైయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్ ఎఫ్ సి ఎల్ ఉద్యోగ బాధితులలో ప్రాణాలు పోగొట్టుకున్న ముంజ హరీష్ కుటుంబానికి నేటి వరకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం అందలేదన్నారు. అఖిలపక్షం నేతలు కూడా దీనిపై ఇప్పటివరకు మాట్లాడటం లేదని అన్నారు. RFCL ఉద్యోగ బాధితులకు ఇప్పటివరకు ఎంత మేరకు డబ్బులు చెల్లించారో కూడా గోప్యంగా ఉంచాల్సిన అవసరమే ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఉద్యోగ బాధితులు ఎంతమంది? వారు దళారులకు ఇచ్చిన డబ్బులు ఎంత? ఎంత తిరిగి చెల్లించడానికి ఒప్పందం చేశారు? ఇప్పటివరకు చెల్లించింది ఎంత? డబ్బులు చెల్లించిన బాధితుల పేర్లను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన RFCL ఉద్యోగ బాధితుల విషయంలో ప్రభుత్వం ఇంత వరకు జోక్యం చేసుకోకపోవడంలో అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అఖిలపక్షం పేరుతో కొంతమంది చేస్తున్న ఈ తతంగాన్ని రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులను తమ ప్రయోజనాల కోసం, తమ రాజకీయాల కోసం వాడుకోవడమే తప్ప వారికి 100% డబ్బులను వెనక్కి ఇచ్చే విధంగా ఒప్పందం చేయకుండా కేవలం 45% మాత్రమే ఒప్పందం చేసి అది కూడా ఎంతమందికి చెల్లించారో గోప్యత ప్రదర్శించి అత్యంత రహస్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితిని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. అందరికి డబ్బులు ఇచ్చే విధంగా ఒత్తిడి తీసుకురావాలని దానికై పోరాట బాటను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం 45 శాతం కుదించి ఇవి తీసుకోకుంటే ఇవి కూడా రాదని బాధితులను బెదిరిస్తూ వారికి నష్టం చేసే నాయకుల చర్యలు కూడా గమనించాలని కోరారు.ఉద్యోగ బాధితులలో ప్రాణాలు పోగొట్టుకున్న ముంజ హరీష్ కుటుంబానికి పూర్తిస్థాయి నష్ట పరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దీనిపై ఒప్పందం చేసిన అఖిలపక్షం కూడా మౌనం విడాలని లేకపోతే భవిష్యత్తులో RFCL ఉద్యోగ బాధితుల అంశంపై వామపక్ష పార్టీలుగా బాధ్యతతో వ్యవహరిస్తామని, 100 శాతం డబ్బులు తిరిగి ఇచ్చే విధంగా పోరాడుతామని, ఆ పోరాటంలో ఉద్యోగ బాధితులు సైతం కలిసి రావాలని కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :