Wednesday, 23 September 2026 03:23:13 AM

భూ నిర్వాసితులను చీకటిమయం చేసిన ఎన్టీపీసీ....మాజీ ఎమ్మెల్యే కోరుకంటి

నిర్వాసితుల కుటుంబాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలి...

Date : 25 January 2025 12:15 PM Views : 809

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / హైదరాబాద్ : భూ నిర్వాసితులకు కనీస ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించకుండా వారి కుటుంబాలను ఎన్టీపీసీ యాజమాన్యం చీకటిమయం చేసిందని రామగుండం నియోజకవర్గ, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు.ఈ సందర్భంగా ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ఇప్పటివరకు ఎన్టీపీసీ యాజమాన్యం కనీస మౌలిక వసతులు సదుపాయాలను కాంట్రాక్ట్ కార్మికులకు కల్పించలేదన్నారు కనీసం వారికి విద్య వైద్యం అందించడంలోనూ విఫలమైందని ఆరోపించారు. ఈనెల 28వ తేదీన పబ్లిక్ ఇయర్రింగ్ ముందే కాంట్రాక్టు కార్మికులకు మోడల్ స్కూల్ తో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కుందనపల్లికి సంబంధించిన యాష్ పాండు మళ్లీ 600 ఎకరాలు భూసేకరణ చేస్తున్న సందర్భంగా అక్కడున్న భద్రిపల్లి, మల్యాలపల్లి, మొగిలిపాడు గ్రామాల ప్రజలను రామగుండం కమిషనరేట్ సమీపంలో ఉన్న సురక్షిత ప్రాంతానికి తరలించాలన్నారు. ఈ ప్రాజెక్టులో సమీప ప్రాంత నిర్వాసితుల యువకులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈనెల 28వ తేదీన ఎన్టీపీసీ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :