ఆకాంక్ష న్యూస్ - ప్రాంతీయ వార్తలు / మంథని : డిసెంబర్ 9 నుండి 16 వరకు న్యూ ఢీల్లీ లో నిర్వహించే జాతీయ స్థాయి కరాటే పోటీలకు మంథని విద్యార్థులు ఎంపికయ్యారు. ఎన్టిపిసి టి.వి గార్డెన్ లో నిర్వహించిన పెద్దపల్లి జిల్లా ఎస్ జి ఫ్ సెక్రటరీ కొమురోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి 68 వ స్కూల్ గేమ్స్ కరాటే సెలెక్షన్స్ నిర్వహించారు . మంథని జె కె ఏ షోటోకాన్ కరాటే ఇనిస్ట్రక్టర్ కోండ్ర నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో . అండర్ 17 విభాగంలో బేరా ఆదిత్య తేజ గోల్డ్ మెడల్, పొట్ల శ్రావణ్ కుమార్ గోల్డ్ మెడల్, రంగు శ్రీ చరణ్ గోల్డ్ మెడల్, తోట హాసిని సిల్వర్ మెడల్స్ సాధించి, డిసెంబర్ 9 నుండి 16 వరకు న్యూ ఢీల్లీ లో జరగపోయే జాతీయ స్థాయి కరాటే సెలక్షన్స్ కి ఎంపికయ్యారు. గెలుపొందిన విద్యార్థులను ఏసిపి మడత రమేష్, జె కే ఏ సౌత్ జోన్ ఇంచార్జి రాపోలు సుదర్శన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూకల బానయ్య, పెద్దపల్లి జిల్లా ఏస్. జి. ఫ్ సెక్రెటరీ కొమురోజు శ్రీనివాస్, పి.ఈ.టి. మాధురి, శంకర్ గౌడ్, పెద్దపల్లి జిల్లా పేట ప్రసిడెంట్ సురేందర్, పి.డి లు శోభారాణి, మాధవి, లక్ష్మణ్, విజయ్, జావిద్, తిరుపతి, ప్రకాష్, ఖజాబీ, పెద్దపల్లి జిల్లా కరాటే మాస్టర్లు అభినందించారు.
Admin
Aakanksha News