Sunday, 27 September 2026 06:16:22 AM

సామాజికవేత్త ఆర్.వి. రమేష్ పుట్టినరోజు వేడుకలు....

వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలతో సందడి...

Date : 11 December 2025 10:34 PM Views : 458

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : సామాజిక సేవ పట్ల అంకితభావం కలిగిన శ్రేయోభిలాషి బుర్ర రమేష్ గౌడ్ అలియాస్ ఆర్.వి. రమేష్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని ఈర్లపల్లిలో ఉన్న ఈశ్వర కృప వృద్ధుల అనాధాశ్రమం సందడిగా మారింది. వ్యక్తిగత వేడుకలకన్నా సేవలో ఆనందాన్ని అనుభవించే రమేష్ గౌడ్, తమ పుట్టినరోజున వృద్ధుల మధ్య ఆనందం పంచుకుంటూ ఉదయం నుంచే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు.వృద్ధుల అవసరాలను గుర్తించి వారికి అన్నదానం, ఫలాహారం, దినసరి అవసరాల వస్తువులు అందజేస్తూ పెద్దలకు శ్రద్ధ, ప్రేమ చూపించారు. పుట్టినరోజు కేక్‌ను కట్ చేయడంతో పాటు, అక్కడి వృద్ధులతో సమయం గడుపుతూ వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. వృద్ధులు ప్రేమతో ఇచ్చిన ఆశీర్వాదాలు రమేష్ గౌడ్‌కు మరింత స్ఫూర్తినిచ్చాయి.స్థానికులు, స్వచ్ఛందసంస్థల సభ్యులు, గ్రామ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని రమేష్ గౌడ్ సేవాభావాన్ని ప్రశంసించారు. సేవ అంటే మాటల్లో కాకుండా పనుల్లో చూపించాలన్న రమేష్ గౌడ్ సంకల్పం అందరికీ ఆదర్శమని పలువురు అభినందించారు. అలాగే సామాజిక బాధ్యతను మరింత విస్తరించే దిశగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని రమేష్ గౌడ్ తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :