Monday, 10 August 2026 04:10:06 PM

గోశాలకి విరాళం అందించిన గాయత్రి విద్యా నికేతన్ విద్యార్థులు...

Date : 24 March 2025 08:00 PM Views : 387

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా నికేతన్ కి చెందిన విద్యార్థినీ విద్యార్థులు బొమ్మకల్ (కరీంనగర్) లోని కామధేను గో విజ్ఞాన కేంద్రం (గోశాల) ను సందర్శించారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ లు విద్యార్థులతో కలిసి గోశాల నిర్వాహకులు పుల్లూరి రామారావుని కలిసి గోశాల నిర్వహణ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... క్షేత్ర పర్యటనలో భాగంగా పిల్లలలో సేవా గుణాన్ని పెంపొందించాలనే ఆలోచనతో బొమ్మకల్ లోని గోశాల ని సందర్శించడం జరిగిందన్నారు. మన పూర్వీకులు గోవును పవిత్రంగా భావించి సంరక్షించారనీ ఈ దిశగా సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అన్నారు.గోవుల సంరక్షణలో భాగంగా మా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు సేకరించిన ₹ 25,016 గోశాల నిర్వాహకులు పుల్లూరి రామారావుకి అందించి, ఈ విరాళాన్ని గో సంరక్షణ, పోషణ, ఆహార సరఫరా కోసం వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు గాయత్రి విద్యా సంస్థల యాజమాన్యాన్ని ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఇ టి స్రవంతి, విద్యార్థినీ విద్యార్థులు, గోశాల సిబ్బంది పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :