ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ఆదివాసీలపై దాడులకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేధిక రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పెద్దపల్లి లోని బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేధిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆదివాసీ హక్కుల సంఘీభావ పోరాట వేధిక కన్వీనర్ లు ముడిమడుగుల మల్లన్న,జిన్నాం ప్రసాద్, గుమ్మడి కొమురయ్య, తాళ్లపల్లి లక్ష్మణ్, రామిళ్ల బాపు శ్రీపతి రాజగోపాల్ లు మాట్లాడుతూ... ఆదివాసీలకు అన్ని ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష,పౌర,ప్రజాస్వామిక, వర్గాల ప్రజలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అడవులలోని కొట్లాది సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అందులో బాగాంగానే చిన్న పసి గుడ్డు మొదలు పండు ముసలి వరకు దాడులు, హత్యలు, అత్యాచారాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. దీనికోసం ఆదివాసీలకు అన్ని వర్గాల ప్రజలు,దళితులు,మేధావులు, హక్కుల కార్యకర్తలు అండగా ఉండాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో CPIML మాస్ లైన్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు గుమ్మడి వెంకన్న, అసంఘటిత కార్మిక సంఘం బాపన్న , రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెళ్తురు సదానందం, ప్రజా ఫ్రంట్ జిల్లా కో కన్వీనర్ గాండ్ల మల్లేశం, కొంతం రాజు, రైతు సంఘం నాయకులు ఎరుకల రాజన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News