Friday, 26 June 2026 01:22:02 AM

పెద్దపల్లి జిల్లాలో మాజీ ఎంపీపై చర్చనీయాంశం..... ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదా....?

ప్రస్తుత ఎంపీ ప్రాధాన్యతను తగ్గించడం వెనుక మర్మమేమిటి...?

Date : 25 July 2025 06:29 PM Views : 1091

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుత ఎంపీ ప్రాధాన్యతను తగ్గించే విధంగా జరుగుతున్న పరిపాలన, పాలకుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అధికారిక కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై స్వయంగా ఎంపీ లేఖ కేంద్రానికి రాయడంతో అధికారుల నిర్లక్ష్యం బట్ట బయలు కావడంతో జిల్లాలో చర్చనియాంశంగా మారింది. ప్రభుత్వం మారి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా, అధికారులు, పాలకులు ఇప్పటికీ పాత పద్దతుల్లోనే వ్యవహరిస్తుండటంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పదవి కాలం ముగిసిన బోర్లకుంట వెంకటేష్ నేత పేరు ఇంకా ఎంపీగా కొనసాగించడం, ప్రస్తుత ఎంపీకి సరైన గౌరవం ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వం మారితే పాలన మారాలి, కానీ ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇది పాలకుల నిర్లక్ష్యమా లేక ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యమా?" అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.అయితే ప్రస్తుత ఎంపీ అధికారిక కార్యక్రమాలకు హాజరు అవుతున్నప్పటికీ, జిల్లాలోని పలు విభాగాల్లో ఆయన సూచనలను పట్టించుకోవడం లేదని ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. అభివృద్ధి పనులపై చర్చల్లోనూ ప్రస్తుత ఎంపీకి ప్రాధాన్యత తగ్గినట్లు కనబడుతోంది.ఎంపీని పట్టించుకోవడం లేదంటే ప్రజాస్వామ్యానికి అవమానం. జిల్లాకు ఎంపీని ప్రజలే ఎన్నుకున్నారు. అయితే అధికారుల తీరు చూస్తే, ప్రస్తుత ఎంపీ స్థానాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నం జరుగుతోందనే అనుమానం కలుగుతోందని కొంత మంది ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాత ఎంపీ పేరే ఎందుకు కొనసాగుతోంది.. ?

పదవి కాలం ముగిసిన బోర్లకుంట వెంకటేష్ నేత పేరు ఇంకా కొన్ని అధికారిక పత్రాలలో, వెబ్‌సైట్లలో కొనసాగుతుండటమే కాకుండా, అధికారుల వ్యవహార శైలిలోనూ పాత ఎంపీకి ఉన్న ప్రాధాన్యత కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంతకాలం ఈ తప్పును సరిదిద్దకపోవడం వెనుక మర్మమేమిటి? ప్రస్తుత ఎంపీకి విలువ ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దింతో ప్రస్తుత ఎంపీని పట్టించుకోవడం లేదన్న విమర్శలు పెరుగుతుండటంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. "ఎంపీ అంటే ప్రజల ప్రతినిధి. ఆయన సూచనలను విస్మరించడం అంటే ప్రజల ఆవశ్యకతలను నిర్లక్ష్యం చేయడమే. ఇది అధికారులే కాకుండా ప్రభుత్వ నిర్లక్ష్యంగా భావించవచ్చు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో అధికారుల ఈ వైఖరిపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే, త్వరలోనే ప్రజా వేదికల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :