ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు యాదవ్ (38) అనే యువకుడు కావేరి సీడ్స్ సంస్థలో అగ్రి ఎంప్లాయిగా పని చేస్తున్నాడు.ఉద్యోగ అవసరాల కోసం ఓదెల నుండి పెగడపల్లి వెళ్తుండగా, ఉదయం సుమారు 9 నుంచి 10 గంటల మధ్య ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన సిమెంట్ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు రిషి కుమార్, లడ్డు ఉన్నారు. సమాచారం అందుకున్న పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
Aakanksha News