Saturday, 07 February 2026 03:33:04 AM

ప్రజా ఆదరణతో దూసుకుపోతున్న కుర్చీ గుర్తు...

– 57వ డివిజన్ అభివృద్ధే నా లక్ష్యం... స్వతంత్ర అభ్యర్థి గుండు రాజు...

Date : 06 February 2026 05:47 PM Views : 116

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా కుర్చీ గుర్తుతో బరిలో నిలిచిన గుండు రాజు చంద్రశేఖర్ నగర్‌లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్, ద్వారకా నగర్, కాకతీయ నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకుని తన అభివృద్ధి ప్రణాళికలను వివరించారు.తనను గెలిపిస్తే 57వ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని గుండు రాజు ప్రజలకు భరోసా ఇచ్చారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు, యువతకు ఉపాధి పథకాలు,వృద్ధులకు పెన్షన్లు, వికలాంగులకు సంక్షేమ పథకాలు అమలు చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా సంక్షేమమే తన రాజకీయ అజెండా అని స్పష్టం చేశారు.ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడిగి, ఆ తర్వాత ప్రజలను మరిచిపోయే నేతలకు ఓట్లు వేస్తే అభివృద్ధి శూన్యమవుతుందని ప్రజలు ఆలోచించాలని ఆయన పిలుపు నిచ్చారు. 57వ డివిజన్‌లోని ప్రతి అన్న, తమ్ముడు, అక్క, అమ్మ, నాన్న ఆలోచించి కుర్చీ గుర్తుకు ఓటు వేస్తే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసి డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.గుండు రాజు ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అనేక మంది స్థానికులు స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్న నాయకుడిగా ఆయనకు మద్దతు తెలుపుతూ తప్పకుండా గెలిపించుకుంటామని భరోసా ఇస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా ప్రచారం చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన గుండు రాజు ప్రచారంతో 57వ డివిజన్‌లో రాజకీయ సమీకరణాలు కుర్చీ గుర్తు వైపే మలుపు తిరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :