Friday, 26 June 2026 12:20:31 AM

ప్రజాభిప్రాయ సేకరణ అంటే.. అధికారంలో ఉన్నవారే మాట్లాడటమా...⁉️

నిర్భందాలు కొనసాగించి ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా...⁉️ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్..

Date : 29 January 2025 12:10 PM Views : 810

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ప్రజాభిప్రాయ సేకరణ అంటే కేవలం అధికారంలో ఉన్నవారే మాట్లాడటమా.. ఇతరులు ఎవరు మాట్లాడకుండా చేయడమా అని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పోలీస్ నిర్బంధంలో ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగించడం ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. ఇబ్బందాలు కొనసాగించి ప్రజాభిప్రాయ సేకరణ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణను రద్దుచేసి మళ్లీ ప్రజల సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించాలన్నారు. నక్సలైట్లను, దొంగలను తీసుకువెళ్లినట్లు ప్రతిపక్ష నాయకులను ఉదయం వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకొని నిర్బంధాలు కొనసాగించడం సరైన విధానం కాదని ఆయన ఖండించారు. ఎన్టీపీసీ ప్లాంట్ ఏర్పాటు విషయంలో గతంలో ఎంతోమంది స్థానిక గ్రామస్తులు తమ భూములను కోల్పోయి ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేశారని వారికి ఇప్పటి వరకు విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎన్టీపీసీ యాజమాన్యం విఫలమైందని విమర్శించారు. కనీసం మౌళిక వసతులను కూడా కల్పించడంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలను మానుకోవాలి ఆయన సూచించారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :