ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో రైతులకు రైతుబంధు తో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించింది. అయితే ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రైతులు రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారుల తీరును నిరసిస్తూ పెద్దపల్లిలో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వారిపై నోరు పారేసుకోవడంతో ఆగ్రహించిన రైతులు తమదైన శైలిలో దేహశుద్ధి చేసి కాంగ్రెస్ నాయకుడికి బుద్ధి చెప్పారు. వివరాల్లోకి వెళ్తే... నిమ్మనపల్లి ఐకేపీ సెంటర్ లో వడ్లు కొనకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడంతో అధికారుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రైతులు చేస్తున్న ధర్నాలు చూసి అవహేళన చేస్తూ రైతులపై బూతు పురాణంతో నోరు పారేసుకోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు తమదైన శైలిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడికి బుద్ధి చెప్పారు. ఒకసారిగా ముకుముడిగా దాడి చేసి నడిరోడ్డుపైనే చితకబాదరు. రైతులు తమ తడాఖా చూపించారు. తమదైన శైలిలో కాంగ్రెస్ నాయకుడికి బుద్ధి చెప్పిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీ అంశంగా మారుతుంది.
Admin
Aakanksha News