Monday, 10 August 2026 02:09:30 PM

దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై కేంద్ర హోమ్ శాఖకు పిర్యాదు...

పోలీసులు తీరు మార్చుకోక పోతే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం... కందుల సంధ్యారాణి

Date : 12 December 2024 12:02 PM Views : 1262

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై కేంద్ర హోమ్ శాఖకు పిర్యాదు చేస్తామని రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ, బిజెపి నాయకురాలు కందుల సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంధ్యారాణి మాట్లాడుతూ...ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 26 హామీలను అమలు చేయాలనీ శాంతియుతంగా బైకు ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకొని అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తూ అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని విమర్శించారు. పోలీసులు తమ తీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :