ఆకాంక్ష న్యూస్ - ప్రాంతీయ వార్తలు / గోదావరిఖని : భారత కమ్యూనిస్ట్ పార్టీ రామగుండం నగర సమితికి పట్టిన ఆ నలుగురు చీడ పురుగులు కె.కనకరాజు, గోసిక మెహన్, గౌతమ్ గోవర్ధన్, తాళ్ళపెళ్లి మల్లయ్య లని మద్దెల దినేష్ ఒక్క ప్రకటనలో ఆరోపించారు.ఏండ్ల తరబడి సిపిఐ పార్టీ పేరుతో పదవులను అడ్డం పెట్టుకొని పంచాయితీలు చేస్తూ నమ్మి వచ్చిన వారిని మోసం చేయడమే కాకుండా అందిన కాడికి దండుకోవడం రోజు వారి పని అని పేర్కొన్నారు.కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా ఉండి వారి హక్కుల కోసం పోరాడాలని నా వంతుగా పోరాటాలు చేస్తూ సమస్యలు పరిస్కారం చేస్తుంటే, నువ్వు కార్యక్రమాలు ప్రజల కోసం చేయద్దు, ప్రజా పోరాటాలు చేస్తే మనకు ఏమి ఉపయోగం అని కేవలం మనకు డబ్బులు వచ్చే కార్యక్రమాలు మాత్రమే చేయాలనీ చెప్పే ఆ నలుగురు అన్నారని ఆరోపించారు. ప్రతి సంవత్సరం కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్షిప్ పార్టీ సభ్యులు కడితే మెంబర్ షిప్ కూడా సొంత ఖర్చులకు వాడుకునే దుర్మార్గపు నాయకులని, జిల్లా కౌన్సిల్, కార్యవర్గంలో జిల్లా ఇంచార్జి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులకు తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ, వారిని నమ్మిస్తూ తమ పదవులను కాపాడుకోవడం ఈ నలుగురి పనని ఆయన పేర్కొన్నారు.ఒకరిద్దరితో సమాచార హక్కు చట్టం క్రింద దరఖాస్తులు పెట్టించడం వారిని బ్లాక్ మెయిల్ చేయడం అందిన కాడికి పుచ్చుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఏద్దేవ చేసారు.ఉదయం లేవగానే కేవలం పార్టీ కార్యాలయంలో కూర్చోని పంచాయితీ లు చేయడం, జయంతిలు, వర్దంతిలు మాత్రమే చేయడం తప్ప ఏనాడు ప్రజా పోరాటాలు చేసిన దాఖలాలు లేవని, పోరాటలు చేస్తే పోలీస్ కేసులు అవుతాయని పార్టీ కార్యాలయం దాటి బైటికి రారని ఆయన అన్నారు. ఇక పోతే మున్సిపల్ ఎన్నికలు వస్తే సిపిఐ పార్టీ టిక్కెట్లు ఇచ్చినట్టే ఇచ్చి టిక్కెట్లు తీసుకున్న అభ్యర్థుల ఇండ్లకు వెళ్లి కొంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం డబ్బులు తీసుకోని ఆ డివిజన్ లో ఉన్న ప్రత్యర్థితో కుమ్మకై సిపిఐ పార్టీ టికెట్స్ తీసుకున్న అభ్యర్థులను ఓటు వేయద్దని ప్రచారం చేసేది కూడ ఈ నాయకులేనని ఆయన విమర్శించారు. నా వంతుగా నాడు ఆర్ఎఫ్ సిఎల్ కుంభకోణం బైటికి తీసి నిరుద్యోగుల తరుపున పోరాడితే ఇదే నాయకులు కుంభకోణానికి పాల్పడిన గత మాజీ ప్రజాప్రతినిధి మద్దెల దినేష్ సిబిఐని కూడా ఆశ్రయించాడని అయనతో నాకు ఇబ్బంది అవుతుందని గత ముఖ్య ప్రజా ప్రతినిధితో చేతులు కలిపి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలను, పార్టీని మాజీ ప్రజాప్రతినిధికి తాకట్టు పెట్టి మద్దెల దినేష్ పార్టీ నుండి తొలగిస్తామని హామీ ఇచ్చి వీరు నెల నెల జీతాలు తీసుకున్న ఈ నాయకులు కమ్యూనిస్ట్ ద్రోహులు అని, వీరు ఆ ప్రజా ప్రతినిధితో చేతులు కలిపిన ఇంటిపై దాడి చేయించిన చరిత్ర వీరిదని ఆయన పేర్కొన్నారు.నేను ప్రజా సమస్యల కోసం కొన్ని సందర్భాలలో ప్రాణాలు తెగించి పోరాడితే అవి చూసి ఓర్వలేక, జీర్ణించుకోలేక, కేవలం నేను ఒక దళితుడినని, ఆ దళితుడు పార్టీలో ఎదుగుతున్నాడని పార్టీలో మాకు రాని పేరు దినేష్ కు ఎలా వస్తుందని కక్ష్యపూరితంగా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, పార్టీ మెంబర్ షిప్ లేదని ప్రచారం చేయడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు.వారికి నా మెంబర్ షిప్ చూపిస్తే పార్టీకి రాజీనామా ప్రకటిస్తారా అని ప్రశ్నించారు.కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నేతలు చాడ వెంకట్ రెడ్డి, కలవేన శంకర్, తాండ్ర సదానందంలకు వీరి నటన తెలుసుకోవాలని, ఈ నలుగురు లాంటి నాయకులను మీరు నమ్మి మోసపోతున్నారని, ఇలాంటి కమ్యూనిస్టు ద్రోహులను నమ్మి, పేదల కోసం పోరాడే వారిని పార్టీకి చెడ్డ పేరు తీసుకస్తున్నారని వారి చెర నుండి కమ్యూనిస్ట్ పార్టీని కాపాడుకోవాలని ఆయన పై నాయకులకు సూచనలు చెస్తున్నాని, లేని యడల వారు మీరు తీవ్రంగా నష్టపోతారని, వారు ఊసరవెల్లి లాంటి వారన్నారు.ప్రజలకు, వ్యాపారాలు వివిధ వర్గాలకు చెందిన వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) పేరు చెప్పుకొని వచ్చి నమ్మబలికి, మోసాలు చేస్తుంటారని కావున వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని రామగుండం ప్రజానీకానికి ఆయన విజ్ఞప్తి చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న లేకున్నా ప్రజా సమస్యల కోసం పోరాడే తత్వం నాదని, పదవులు ఐనా , నా ప్రాణమైన నాకు గడ్డి పోచలాంటిదని, నేను నిరంతరం ప్రజలలో ఉంటా.. నా ప్రాణం ఉన్నంత కాలం ప్రజల సంక్షేమం కోసం న్యాయబద్ధంగా పోరాడతానని ఎవరికి లొంగేది లేదని ఆయన తెలిపారు.అదే విదంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు నా పైన సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ట్రోల్ చేపిస్తున్నారని వారి పై చట్ట పరంగా, న్యాయ పరంగా వెళ్తాన్నని ట్రోల్ చేస్తున్న, చేపిస్తున్న వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని ఆయన హెచ్చరించారు.
Admin
Aakanksha News