Friday, 07 August 2026 02:53:53 AM

కరాటే పోటీలలో ప్రతిభ చాటిన మంథని విద్యార్థులు...

Date : 24 September 2024 12:56 PM Views : 377

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : గోదావరిఖని ఆర్ సీ ఓఏ క్లబ్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా పెద్దపల్లి జిల్లా సెక్రెటరీ కొమురోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే సెలెక్షన్స్ లో మంథని విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జె కె ఏ షోటోఖాన్ కరాటే ఇనిస్ట్రక్టర్ ఆధ్వర్యంలో 9 మంది క్రీడాకారులు ఉమ్మడి కరీంననగర్ జిల్లాకి ఏంపికయ్యారు. అండర్ 14 విభాగంలో తాటి సాయి రక్షిత్, నాంపల్లి లక్ష్మణ్, వడ్లకొండ శ్రీనిత, అండర్ 17 విభాగంలో తోట హాసిని, బేరా ఆదిత్య తేజ, పొట్ల శ్రావణ్ కుమార్, డుల్ గచ్ దేవాన్ష్, నివాస్,రంగు శ్రీ చరణ్ లు సెలక్ట్ ఎంపికయ్యారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులను జె కే ఏ సౌత్ జోన్ ఇంచార్జి రాపోలు సుదర్శన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూకల బానయ్య, పెద్దపల్లి జిల్లా ఏస్ జి ఫ్ సెక్రెటరీ కొమురోజు శ్రీనివాస్, పి.ఈ. టి మాధురి, ఇంద్రాణి, శివ, సతీష్, పెద్దపల్లి జిల్లా కరాటే మాస్టర్లు అభినందించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :