Monday, 21 September 2026 09:20:38 AM

రామగుండం నూతన సీపీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన బిజేపి నేతలు..!

Date : 12 March 2025 08:06 PM Views : 334

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం నూతన కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝాని రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ కందుల సంధ్యారాణి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి కమిషనర్ కి పుష్పగుచ్ఛం అందించి,శాలువాతో సన్మానించారు.రామగుండం ప్రాంత అభివృద్ధికి,శాంతి భద్రతల పరిరక్షణకు సంపూర్ణ సహకారం అందిస్తామని, నగరంలో ప్రజాసమస్యల పరిష్కారంలో బీజేపీ పూర్తి సహకారం అందిస్తుందని కందుల సంధ్యారాణి తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గాండ్ల ధర్మపురి,తోట కుమారస్వామి ,మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ,గుండబోయిన భూమయ్య,కోడూరి రమేష్,సిలువేరు అంజి తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :