ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : జాతీయ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా నాయకులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొంకూరి అవినాష్ డిల్లీలో ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ బిజెపి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసి దేశవ్యాప్తంగా నిరుద్యోగం లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్యాయం చేశారని ఆరోపించారు. నిరుద్యోగులతో చెలగాటమాడితే సహించేది లేదని, వెంటనే కేంద్రప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే దేశ వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమాల్లో పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News