Sunday, 27 September 2026 04:14:20 AM

టిడిపి ఆవిర్భావంతోనే సంక్షేమానికి నాంది...మాజీ టీడీపీ జిల్లా అద్యక్షుడు అక్కపాక తిరుపతి

ఘనంగా 43వ టిడిపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు...

Date : 29 March 2025 04:30 PM Views : 419

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి,టీడీపీ సీనియర్ నాయకుడు కోల కిషన్ రావులు స్థానిక నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ జండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సంక్షేమానికి నాంది పలికిందని అన్నారు.సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించారని ఆయన గుర్తు చేశారు. పేదల జీవితాలకు పెన్నిధిగా, అన్నదాతలకు ఆశాదీపంగా, ఆడపడుచులకు అన్నగా,బడుగుల సంక్షేమానికి వినూత్న పథకాలెన్నో తెచ్చారని కొనియాడారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కీలో బియం, పలు సంక్షేమ పథకాలను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాలవారు కూడా అమలు చేశారని తెలిపారు.తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోప్పుల మురళి, ముదుకర్,అక్కపాక చంద్రయ్య,పెరుక శ్రీనివాస్,బొంకూరు సతీష్, పెరుక సుధాకర్,ఈర్ల శంకర్,మాచర్ల రాజు,కుక్క శంకర్,విక్రమ్,తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :