ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : వైకుంఠధారంలో వైష్ణవి ఆహారం.... అనే చందంగా పరిస్థితి తయారయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు చేసిన ప్రతిసారి ఆహార నాణ్యత లోపాలతో బట్టబయలవుతూ ప్రజల ఆరోగ్యాలతో రెస్టారెంట్ యాజమాన్యం చేలగాటమాడుతుంది. గతంలోనూ తనిఖీలు నిర్వహించిన పలు సందర్భాల్లో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్రత ఆహార పదార్థాలతో పట్టుబడిన సమయంలో అధికారులు రెస్టారెంట్ యాజమాన్యానికి జరిమాన విధించి వదిలిపెట్టారు. అయినా సదురు రెస్టారెంట్ యాజమాన్యం తీరు మార్చుకోకుండా అదే పద్ధతిని కొనసాగిస్తూ మరోసారి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అధికారులకు దొరికిన వైష్ణవి రెస్టారెంట్ పై పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్.ఏసీ జె. అరుణ శ్రీ ఆదేశాల మేరకు ప్రజా ఆరోగ్య విభాగం అధికారులు గోదావరిఖని ఐబీ కాలనీలోని వైష్ణవి ఫ్యామిలీ రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించని అపరిశుభ్రత ఆహార పదార్థాలను గుర్తించి రెస్టారెంట్ యాజమాన్యానికి పదివేల రూపాయల జరిమానాలను విధించారు. గతంలోనూ తనిఖీలు చేసిన సమయంలో అపరిశుభ్రత ఆహార పదార్థాలతో దొరికి జరిమానాలు చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. నిర్లక్ష్యంగా ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వైష్ణవి ఫ్యామిలీ రెస్టారెంట్ పై జరిమానాలతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ తనిఖీలలో రామగుండం నగర పాలక సంస్థ హెల్త్ అసిస్టెంట్ కిరణ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, సిబ్బంది శ్రీకాంత్, శ్రావణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Aakanksha News