ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కృషి చేస్తున్నారని, ఇది చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన అనుచరులతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా తిప్పరపు శ్రీనివాస్, పెద్దేల్లి తేజస్విని, మోహిద్ సన్నిలు మాట్లాడుతూ... ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిరంతరం రామగుండం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ రామగుండం నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకోవచ్చారో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. రామగుండం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని నిధులు తీసుకోవచ్చామో మేము చర్చకు సిద్ధమని వారు సవాల్ విసిరారు. ఉద్యమాకారుల ముసుగులో మాజీ ఎమ్మెల్యే అనుచరులు అనుచిత వాఖ్యలు చేస్తున్నారని ఇలాంటి మాటలు మాట్లాడటం మానుకోవాలని అన్నారు. డిష్ నడుపుకునే స్థాయి నుండి ఇన్ని కోట్ల రూపాయలకు ఏలా పడగాలేత్తరని ప్రశ్నించారు.గతంలో మీతో ఉండే కార్పొరేటర్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేసే అభివృద్ధిని చూసి ఆయన వెంట వస్తున్నారని అసలు ఇప్పుడు మీతో ప్రస్తుతం ఎంత మంది కార్పొరేటర్లు ఉన్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మహిళా కార్పొరేటర్లను అవమాన పరిచే విధంగా మాట్లాడారు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలీసులతో రాజకీయం చేసింది మీరు కాదా అనే ప్రశ్నించారు. అసలు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు పోలీసులకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. పోలీసులకు ఎమ్మెల్యేకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎస్సీ సబ్ ప్లాన్ కోసం ధర్నా చేసినప్పుడు మహిళా కార్పొరేటర్లను పోలీసులతో అణగదొక్కింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఓసీపీల మీద ధర్నా చేసినప్పుడు పోలీసులను పెట్టి అరెస్టు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు.మాజీ ఎమ్మెల్యే చందర్ తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే చిరు వ్యాపారులకు అన్యాయం జరుగుతుందనే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కూల్చివేతల వల్ల అసలు ఎవరికైనా అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వచ్చారా అని అన్నారు. అసలు అన్యాయం జరిగిందని భాధితులను తీసుక వచ్చిన దాఖలలే లేవన్నారు. ఎక్కడో రాయలసీమకు చెందిన వ్యకిని మేయర్ చేసిన ఘనత నీది కదా అని ప్రశ్నించారు. ఇప్పటికైన బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు రామగుండం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.
Admin
Aakanksha News