Tuesday, 11 August 2026 07:49:00 PM

యువ వికాసం పథకం యువత సద్వినియోగం చేసుకోవాలి.

Date : 21 March 2025 04:42 PM Views : 555

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బొంకూరి అవినాష్ పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సబ్సిడీపై రుణాలు అందించేందుకు యువ వికాసం పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. పథకం అమలు పట్ల పెద్దపల్లి అయ్యప్ప కూడలిలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి సీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రావణ్, మండల అధ్యక్షులు జడల రాజు, మాజీ కౌన్సిలర్ భూతగడ్డ సంపత్, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరంగి రాజు, ఎన్ఎస్ యుఐ జిల్లా ఉపాధ్యక్షులు పెనుగొండ ప్రణయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొంకూరి పవన్ కుమార్, మండల ఉపాధ్యక్షులు రాకేష్, మహేందర్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :