ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని సంజయ్ గాంధీనగర్‌లో ఉన్న శ్రీ చైతన్య హై స్కూల్ గ్లోబల్ ఎడ్జ్ క్యాంపస్‌లో పాఠశాల ఆవరణలోనే పాఠ్యపుస్తకాలు అమ్మకం జరుగుతుండటంపై డివైఎఫ్ఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ తనిఖీలు లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్, సహాయ కార్యదర్శి అట్లా శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులపై బలవంతపు కొనుగోళ్ల ఒత్తిడి పెడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గతంలో అనుమతుల్లేదంటూ ప్రభుత్వమే పేర్కొన్న బిల్డింగ్‌లో ఇప్పుడు అనుమతులు ఉన్నట్లు ఎంఈఓ చెబుతుండడం సందేహాలు కలిగిస్తోందని విమర్శించారు.ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠశాల ఆవరణలో పుస్తకాలు అమ్ముతున్న శ్రీ చైతన్య హై స్కూల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
Admin
Aakanksha News