Monday, 16 March 2026 04:58:54 PM

54వ డివిజన్‌లో గడపగడపకు కారు గుర్తు ప్రచారం...

– ప్రజా దీవెనలతో దూసుకెళ్తున్న ఇనుముల సత్యం...

Date : 06 February 2026 05:43 PM Views : 378

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్‌లో టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్) పార్టీ కారు గుర్తు అభ్యర్థి ఇనుముల సత్యం గడపగడపకు నిర్వహిస్తున్న విస్తృత ప్రచారం ప్రజలలో విశేష స్పందనను రాబడుతోంది. శుక్రవారం నాడు డివిజన్‌లోని ప్రతి వీధి, ప్రతి ఇల్లు తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.తాను గెలుపొందితే 54వ డివిజన్‌ను రామగుండం కార్పొరేషన్‌లోనే ఒక మోడల్ డివిజన్‌గా అభివృద్ధి చేస్తానని ఇనుముల సత్యం ప్రజలకు హామీ ఇచ్చారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని వివరించారు.ఇనుముల సత్యం నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. “సత్యం నీ వెంటే ఉంటాం… భారీ మెజార్టీతో గెలిపిస్తాం” అంటూ స్థానికులు ఆశీర్వాదాలు అందిస్తున్నారు. ప్రజలతో కలిసిపోయే స్వభావం, నవ్వుతూ మాట్లాడే తీరుతో ప్రతి ఒక్కరి మనసు గెలుచుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు.శ్రమశక్తి అవార్డు గ్రహీతగా, ప్రజల కష్టాలు దగ్గర నుంచి తెలిసిన వ్యక్తిగా సత్యం చేస్తున్న ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంటోంది. ఆయన వెంట కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. డివిజన్‌లో ఎక్కడ చూసినా కారు గుర్తుకే ఓటు వేస్తామని, ఇనుముల సత్యాన్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు భరోసా ఇస్తుండటంతో 54వ డివిజన్‌లో రాజకీయ వాతావరణం ఉత్సాహంగా మారింది. ప్రజా దీవెనలతో ఇనుముల సత్యం గెలుపు దిశగా దూసుకెళ్తున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :