Saturday, 26 September 2026 04:39:39 AM

అదిరించి, బెదిరించి చేస్తామంటే ఒప్పుకునేది లేదు....

కోర్టు ధిక్కరణకు పాల్పడితే జైలుకు వెళ్లక తప్పదు.... వేముల అశోక్

Date : 18 October 2024 11:56 AM Views : 991

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : అదిరించి, బెదిరించి కుల్చివేతలు చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని ఓల్డ్ అశోక్ దియేటర్ లీజ్ హోల్డర్ వేముల అశోక్, పులిపాక రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.... కూల్చివేతల పేరుతో కొందరు విధ్వంసాలకు పాల్పడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని చట్టపరంగా వారు బాధ్యలు అవుతారని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికి పోలీసులు పట్టించు కోవడం లేదని కూల్చివేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారుల కరెంట్ తీసివేశారని కేసు కోర్టు పరిధిలో ఉన్న సమయంలో ఏలా కరెంట్ తీసివేస్తారని వారు ప్రశ్నించారు. దీనిపై పెద్దపల్లిలోని కరెంట్, మున్సిపల్ తో పాటు ఇతర అధికారులను సంప్రదిస్తే మేము కరెంటు తీసేయమని ఎవరికి ఆదేశాలు జారీ చేయలేదని మాకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేసినట్లు వారు తెలిపారు. ఈ కూల్చివేతలకు సంబంధించి కోర్టు పరిధిలో ఉందని ఈ విషయంలో మేము జోక్యం చేసుకోమని అధికారులు తెలిపారని అన్నారు. ఇప్పటికే తప్పు చేసిన ఎంతో మంది ఉన్నతాధికారులు ఐఏఎస్, ఐపీఎస్ లు జైలుకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయని కూల్చివేతలో పాల్గొనేవారు అది గుర్తుంచుకోవాలన్నారు. కొందరు కావాలని దృష్ట శక్తులను ఉసిగొల్పుతూ ఈ కూల్చివేతలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ స్థలానికి సంబంధించి మేము కోర్టు తీర్పును గౌరవిస్తామని, చట్టానికి ఎవరూ కూడా అతీతులు కారని వారు హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో జేవి రాజు, నీరటి శంకర్, శ్రీనివాస్, షకీర్ బాబా తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :