Monday, 10 August 2026 11:11:32 AM

ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే...

Date : 18 April 2025 10:00 AM Views : 720

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గ్రామంలో ఐకెపి కేంద్రాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ను ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. అలాగే ఎటువంటి కటింగులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ప్రభుత్వం భరోసానిస్తుందని తెలిపారు. దీంతోపాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు గౌరవం పెరిగిందని రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :