Wednesday, 04 February 2026 05:40:18 AM

రామగుండం కార్పొరేషన్ మేయర్ బరిలో నీరటి శ్రీనివాస్...?

Date : 17 January 2026 09:52 PM Views : 474

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానిక రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలో రామగుండం కార్పొరేషన్ మేయర్ బరిలో బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి నీరటి శ్రీనివాస్ కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది.రామగుండం నియోజక వర్గంలో న్యూ ఇండియా పార్టీ, తెలుగుదేశం పార్టీ తదితర రాజకీయ పార్టీల్లో క్రియాశీల కార్యకర్తగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన నీరటి శ్రీనివాస్, అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు బీఆర్‌ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షులు కోరు కంటి చందర్ నాయకత్వంలో చురుగ్గా పనిచేస్తున్నారు.తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రజా ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన నీరటి శ్రీనివాస్, ప్రతి రాజకీయ కార్యక్రమంలో ముందుండి నడిపించే శైలితో కార్యకర్తల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో పరాజయం పొందినప్పటికీ, రాజకీయంగా వెనకడుగు వేయకుండా తన కార్యకలాపాలను మరింత ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన నీరటి శ్రీనివాస్, పార్టీ కార్యక్రమాల్లోనే కాకుండా ప్రజా సమస్యలపై స్పందిస్తూ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్‌లో కలుపుగోలుగా ముందుకు సాగుతున్నారు.రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్ గా మారిన నేపథ్యంలో, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవికి పోటీ చేసేందుకు నీరటి శ్రీనివాస్ తనదైన శైలిలో కసరత్తులు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :