Saturday, 27 June 2026 10:05:52 PM

ప్రజా ఆదరణతో గెలుపు దిశగా దూసుకుపోతున్న "నీరటి"

Date : 02 February 2026 09:45 PM Views : 517

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నీరటి శ్రీనివాస్ ప్రజల విశేష ఆదరణతో ఎన్నికల ప్రచారంలో ముందంజలో కొనసాగుతున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుంటూ సాగుతున్న ఆయన సేవాభావం డివిజన్ ప్రజల మనసులను గెలుచుకుంటోంది.అధికారం ఉన్నా లేక పోయినా ప్రజల మధ్యే ఉంటూ ప్రతి సమస్యను స్వయంగా తెలుసుకుంటూ పరిష్కార మార్గాలు చూపే నాయకుడిగా నీరటి శ్రీనివాస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. డివిజన్‌లోని ప్రతి వీధి, ప్రతి కాలనీ, ప్రతి ఇంటితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్న, తమ్ముడు, అక్క, నాన్న అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను వింటున్న ఆయన,తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పింఛన్లు, పేదల గృహాలు, యువత ఉపాధి వంటి అంశాలపై ప్రజలతో విస్తృతంగా చర్చిస్తున్నారు. ప్రతి సమస్యను గమనించి, గెలిచిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని భరోసా ఇస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నారు. 41 డివిజన్ ప్రజలు సైతం “శ్రీనన్న గెలిస్తేనే మా ఇంట్లో మనిషిలా ఉంటారు… మా సమస్యలు పరిష్కరిస్తారు” అనే నమ్మకంతో ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రచార సమయంలో అనేక ప్రాంతాల్లో స్థానికులు నిరాజనాలు పలుకుతూ, ఆశీర్వదిస్తూ గెలుపు దిశగా ముందుకు నడిపిస్తున్నారు. యువత, మహిళలు, వృద్ధులు అన్న వర్గాల నుంచి ఆయనకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది.ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీరటి శ్రీనివాస్, గెలిస్తే తాను ఒక్కరే కార్పొరేటర్ కాదని, 41వ డివిజన్ ప్రజలందరూ కార్పొరేటర్లేనని నినాదంతో ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి నిర్ణయం ప్రజలతో చర్చించి తీసుకుంటానని ఆయన స్పష్టం చేస్తున్నారు. డివిజన్ అభివృద్ధే పరమావధిగా పారదర్శక పాలన, బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిత్వం అందిస్తానని హామీ ఇస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. ప్రజల నమ్మకం, ఆశీర్వాదాలతో గెలుపు లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న నీరటి శ్రీనివాస్, రామగుండం 41వ డివిజన్‌లో ప్రధాన ఆశావహుడిగా నిలుస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :