Wednesday, 12 August 2026 05:47:45 PM

చదువుకోడానికి వచ్చిన పిల్లల చేతిలో చీపుర్లు...

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో వెట్టి చాకిరీ....

Date : 11 September 2025 10:38 AM Views : 693

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనే ప్రధాన కర్తవ్యమని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారుతున్నాయి. ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పుస్తకాల బదులు చేతిలో చీపుర్లు పట్టుకుని గదులను శుభ్రం చేస్తూ కనిపించడం ఆందోళన కలిగించింది.తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం శుభ్రం చేయించేందుకు సిబ్బంది విద్యార్థులను బలవంతం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యకు హాజరైన చిన్నారులను చదువు బోధించాల్సిన గురువులు, సిబ్బంది ఇలాంటివి చేయించడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మా పిల్లలు పాఠశాలకు చదవడానికి వెళ్తే చాలు, ఊడవేయడానికి కాదు. ఉపాధ్యాయులు పిల్లలకు బోధించే బదులు ఇలాంటి పనులు చేయించడం ఏమిటి?” అంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యార్థులపై శారీరకంగా, మానసికంగా ఒత్తిడి కలిగించే ఈ తరహా వెట్టి చాకిరీని చట్టం నిషేధించినప్పటికీ పాఠశాల సిబ్బంది ఇలా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపించిందని, నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దృశ్యాలు బయటపడుతున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు తక్షణమే దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.దీనిపై మరింత పూర్తి కథనం మీ "ఆకాంక్ష న్యూస్" లో

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :