Saturday, 27 June 2026 10:07:19 PM

క్షమాపణ చెప్పకపోతే ఇంటి ముందు టెంట్ వేసి పోరాటం చేస్తాం...

24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి.... నాయకులు అజ్ఞానంతో చేసే వ్యాఖ్యలతో రామగుండంలో కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్టపాలు...

Date : 23 December 2025 02:58 PM Views : 1233

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు యుగంధర్ రజక వృత్తిని అవమానించేలా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఎటువంటి సంబంధం లేని అంశాల్లో రజకుల వృత్తిని కించపరిచేలా “సాకలోడి చదువు” అంటూ అవమానకర వ్యాఖ్యలు చేయడం పట్ల రజక సంఘాల, వృత్తిదారులు, సామాజిక వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.రజకులు శతాబ్దాలుగా గౌరవప్రదంగా కొనసాగిస్తున్న తమ సంప్రదాయ వృత్తిని అవమానించడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశాల్లో కానీ ఇతర సందర్భాల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కనీస పరిజ్ఞానం అవగాహన లేకుండా మాట్లాడడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వార్త కథనం రేపటి ఆకాంక్ష న్యూస్ లో

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :