Saturday, 27 June 2026 10:12:25 PM

హుజురాబాద్‌లో వికలాంగుల పింఛన్ పెంచాలని గ్రామపంచాయతీ ముట్టడి...

Date : 20 September 2025 03:32 PM Views : 370

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామపంచాయతీ వద్ద వికలాంగుల పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం ముట్టడి కార్యక్రమం జరిగింది.కార్యక్రమానికి హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవు నూరి రవీందర్, తెలంగాణ బీసీ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, వికలాంగులు, వితంతువులు, వృద్ధుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం సమాజానికి శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో పింఛన్ పెంపు హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడిచినా అమలు చేయకపోవడం దురదృష్టకరమని వారు విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పింఛన్ దారులకు పెంపును ప్రకటించాలని డిమాండ్ చేశారు. తరువాత గ్రామ కార్యదర్శి గిన్నారపు లావణ్యకు ప్రతినిధులు మెమోరాండం అందజేశారు.ఈ ముట్టడిలో వికలాంగులు వెంకేపల్లి మధుసూదన్, గాజే లక్ష్మి, ప్రియా చందుపట్ల, విట్టల్ మంతెన, భాస్కర్, సంధి మల్లారెడ్డి, ఏఎంసీ మెంబర్ లోకిని రాజకుమార్, బొంగోని శ్రావణ్, ప్రజా నాయకులు గాజుల హరీష్, చింత శ్రీనివాస్, కంకణాల కుమార్, ఒళ్ళాల నరేష్, కంకణాల కొమురయ్య, చింత శ్యామ్, బొల్లెవేని కనకమ్మ, బొల్లెవేని మీనమ్మ, గాజ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. హుజురాబాద్(ఆకాంక్ష) : హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామపంచాయతీ వద్ద వికలాంగుల పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం ముట్టడి కార్యక్రమం జరిగింది.కార్యక్రమానికి హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవు నూరి రవీందర్, తెలంగాణ బీసీ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, వికలాంగులు, వితంతువులు, వృద్ధుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం సమాజానికి శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో పింఛన్ పెంపు హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడిచినా అమలు చేయకపోవడం దురదృష్టకరమని వారు విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పింఛన్ దారులకు పెంపును ప్రకటించాలని డిమాండ్ చేశారు. తరువాత గ్రామ కార్యదర్శి గిన్నారపు లావణ్యకు ప్రతినిధులు మెమోరాండం అందజేశారు.ఈ ముట్టడిలో వికలాంగులు వెంకేపల్లి మధుసూదన్, గాజే లక్ష్మి, ప్రియా చందుపట్ల, విట్టల్ మంతెన, భాస్కర్, సంధి మల్లారెడ్డి, ఏఎంసీ మెంబర్ లోకిని రాజకుమార్, బొంగోని శ్రావణ్, ప్రజా నాయకులు గాజుల హరీష్, చింత శ్రీనివాస్, కంకణాల కుమార్, ఒళ్ళాల నరేష్, కంకణాల కొమురయ్య, చింత శ్యామ్, బొల్లెవేని కనకమ్మ, బొల్లెవేని మీనమ్మ, గాజ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :