ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రామగుండం ప్రాంతంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న కూల్చివేతలపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండంలో కూల్చిన వాటిని కట్టించేందుకు “కమిషన్‌లు దొబ్బే కార్యక్రమం” పేరుతో దోపిడీ జరుగుతోందని ఆయన విమర్శించారు. చిన్నచిన్న వ్యాపారులు, పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.నిన్న రాత్రి ఆకస్మికంగా దారి మైసమ్మ గుడులను కూల్చి వేయడం ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బస్తీలో ప్రజలు ప్రతి సంవత్సరం మైసమ్మ తల్లిని పూజిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించే ఆచారం ఉన్నదని గుర్తుచేశారు. అటువంటి ఆరాధ్య దైవాల గుడులను ఎవరు కూలగొట్టమని ఆదేశించారు? ఎవరి ఆజ్ఞతో ఈ చర్య జరిగింది?" అంటూ ప్రశ్నించారు.దారి మైసమ్మ గుడులను మున్సిపాలిటీ కూల్చిందా? లేక సింగరేణి సంస్థ కూల్చిందా? అన్న విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియక పోవడం గోదావరిఖని ప్రజల్లో అయోమయాన్ని కలిగిస్తోందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.ప్రజల సెంటిమెంట్లను కించపరిచే విధంగా ఎవరు వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకంటి చందర్ అన్నారు. కూలగొట్టిన గుడులను తిరిగి పునర్నిర్మించే బాధ్యత ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్‌దే అని ఆయన స్పష్టం చేశారు.ప్రజల నమ్మకాలు, భక్తి భావాలు కూల్చివేతల కింద దెబ్బతినకూడదు. దారి మైసమ్మ గుడులను తక్షణమే పునర్నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కఠినంగా హెచ్చరించారు.
Admin
Aakanksha News