Saturday, 27 June 2026 10:05:52 PM

ఆపద్బాంధవుడు రాజశేఖరుడిపై నిందలా...? ఘర్షణ సమయంలో ఉన్న వైద్యులు కొందరైతే.. తేర మీదకు వీరి పేరు ఎందుకు...?

వారి సొంత హాస్పిటల్ కే అన్ని అనుమతులు లేవు కానీ పక్క హాస్పిటల్ కోసం పోరాటమా...?

Date : 30 April 2025 08:59 AM Views : 1045

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : వైద్య వృత్తిలో ఉన్న వైద్యులను ప్రజలు దేవుళ్ళతో సమానంగా భావిస్తారు.ఆపద వస్తే కాపాడాలంటూ చేతులెత్తి వేడుకుంటారు... అలాంటి సమయంలో ఎంత దూరమైనా వెళ్లి తమ ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తారు. అలాంటి ఎన్నో ఘటనలలో ఎంతో మంది ప్రాణాలకు భరోసానిస్తూ ఆపద కాలంలో ఆదుకున్న ప్రాణదాత రాజశేఖరునిపై నిందలు మోపడం ఎలా... అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్వతంత్ర చౌక్ లోని శ్రీ మమత హాస్పిటల్ లో పెద్దపల్లి డిఎంహెచ్ఓ పై జరిగిన సంఘటన బాధాకరం అయినప్పటికీ ఈ ఘటనలో ముందుండి రెచ్చగొట్టి తెర వెనుక లేకుండా వెళ్లిన నాయకులైయితేనేమి, ఖద్దర్ చొక్కా నాయకులైయితే నేమి.. కొంత మంది మెడికల్ మాఫియాకు చెందిన వారైతే నేమి ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు... ఎవరు బాధ్యతయుతంగా తీసుకుంటారు.. అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి పెద్దపల్లి డిఎంహెచ్ఓ ఆస్పత్రి తనిఖీ నిర్వహించే సమయంలో అక్కడ ఘర్షణకు దారి తీసిన సందర్భంలో ఉన్న డాక్టర్ నాగిరెడ్డి, అనిల్ కుమార్, తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహంకాళి స్వామి తన అనుచరులు నాయకులు ఇలా ఎంతోమంది ఉన్నారు. ఈ ఘటన సమయంలో డా. రాజశేఖర్ రెడ్డి, కానీ డాక్టర్ ఆర్ జె స్వాతి కానీ ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు లేవు. కానీ కేవలం ఆసుపత్రిలో కన్సల్టెంట్ డాక్టర్ గా విధులు నిర్వహించడంతో వారి పేర్లు చర్చ మీదకు వస్తున్నాయి. అయితే ఆసుపత్రి తనిఖీ చేసే సమయంలో ఖద్దర్ చొక్కా నాయకులతో కలిసి నాన హంగామా హడావిడి హల్ చల్ చేసిన డాక్టర్ నాగిరెడ్డి బూతు పురాణం మొదలు పెట్టడమే ఈ వివాదానికి కారణంగా తెలుస్తుంది. అయితే కరోనా కష్ట సమయంలో ఎంతో మంది ప్రజలు కరోనా బారిన పడితే వారిని రక్షించడానికి కుటుంబాన్ని చిన్నపిల్లల గురించి కూడా ఆలోచించకుండా ప్రజల కోసం వైద్యం అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డికే దక్కుతుంది. తనకు మూడు సార్లు కరోనా వచ్చిన కూడా ఎక్కడ వెనుకడుగు వేయకుండా ప్రజల కోసం కష్టపడ్డ వైద్యుడిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇలాంటి వైద్యులపై నిందలు రావడం చర్చకు దారి తీస్తుంది. అయితే శ్రీ మమత హాస్పిటల్ లో పెద్దపల్లి డిఎంహెచ్ఓ తో ఘర్షణ జరిగే సమయంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కానీ, డాక్టర్ ఆర్ జె స్వాతి కానీ అక్కడ లేరనేది బహిరంగ రహస్యం. ఆ సమయంలో అక్కడ ఉండి హల్ చల్ చేసిన కొంతమంది వైద్యులు నాయకులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇక్కడ కొంత మంది ఆసుపత్రులు నిర్వహించే వారి సొంత హస్పటల్ లకే అనుమతులు లేవు కానీ వీరు పక్కా హాస్పిటల్ కోసం పోరాటాలు నిర్వహిస్తారట... ఇది చూసి ప్రజలు ముక్కున వేలేసుకొని నవ్వుకునే పరిస్థితి నెలకొంటుంది. దీనిపై మరింత పూర్తి కథనం ఆకాంక్ష న్యూస్ లో

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :