Monday, 11 May 2026 06:01:42 PM

ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే కాసుల వర్షంపై అధిష్టానం నజర్.....

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదై చేదు అనుభవం...అధిష్టానం చర్యలు ఏ విధంగా ఉంటాయో అని రాజకీయ వర్గాల్లో చర్చ....

Date : 12 March 2025 11:08 AM Views : 1411

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / దాట్ల జేమ్స్ రెడ్డి : ఉత్తర తెలంగాణ జిల్లాలో ఓ నియోజకవర్గం రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం రాజకీయాలు ఒకలా ఉంటే ఆ నియోజకవర్గంలో మాత్రం రాజకీయాలు విభిన్న పరిస్థితులకు దారితీస్తూ ఉంటాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చే తీర్పు వైవిధ్యంగా ఉంటుంది అనడానికి ఎన్నో సంఘటనలే నిదర్శనం. ఏదైనా నాయకుడిని అయ్యో పాపం అని ప్రజలు ఆదరించారంటే ఆ నియోజకవర్గంలో ఆ నాయకుడు కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాడనేది ఇక్కడి రాజకీయ నాయకుల భావన. అయితే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారుతుంది. అక్కడ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు ప్రతిపక్షాలు వేలెత్తి చూపించే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఓ ఎమ్మెల్యే బూడిద, ఇసుక, మట్టి, వేస్టేజీ వంటి వాటిలో ప్రమేయం ఉన్నట్లు ప్రతిపక్షాలు నేరుగానే ప్రశ్నిస్తున్నాయి. సదురు ఎమ్మెల్యేకు ఆ నియోజకవర్గం నుండి సుమారుగా రోజుకు 20 లక్షల రూపాయల వరకు వస్తుందని అంచనా. అయితే సదరు ఎమ్మెల్యే ఎం టాక్స్ పేరుతో చేస్తున్న వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎం టాక్స్ అంటే అందరూ సదురు ఎమ్మెల్యే పేరులో మొదటి అక్షరం అని అనుకుంటున్నారు. కానీ అదంతా కేవలం బయటి వరకే. ఎం టాక్స్ పేరులో మరో అర్థం దాగి ఉందనేది రాజకీయ రహస్యం. అయితే ఏది కావాలన్నా, ఏమి చేయాలన్నా మొదట అక్కడ అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉందని పలువురు సొంత పార్టీ నేతలే గుసగుసలాడడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతే కాకుండా అక్కడ నడిపించేది కూడా ఆ మొదటి అక్షరమే అని పలువురు నేతల నుండి వినిపిస్తున్న వాదన.అలాగే మొన్న జరిగిన ఉపాధ్యాయ, పట్టుభద్రుల ఎన్నికల్లో ఆ నియోజకవర్గానికి చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే గెలుపు అంచనా దాకా వెళ్లి ఓటమిపాలైన అభ్యర్థి పోలైన ఓట్ల వివరాలను ఆయా నియోజకవర్గాల వారీగా సేకరించి పూర్తి నివేదికతో అధిష్టానం వద్దకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సదరు ఎమ్మెల్సీ అభ్యర్థి మీడియా సమావేశంలోనే బహిరంగంగా వెల్లడించడం చర్చని అంశంగా మారింది. అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించిన సదురు ఎమ్మెల్యే కానీ నేతలు కానీ పూర్తిస్థాయిలో నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించకపోవడం వల్లే అక్కడ బిజెపి పార్టీకి ఓటు బ్యాంకు పెరిగింది అని రాజకీయ నాయకులు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలాగైనా ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలని లక్ష్యంతో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలోకి దిగిన సదురు ఎమ్మెల్యే మాత్రం పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించకపోవడం వెనుక మర్మం ఏంటి అనే చర్చ జోరుగా సాగుతుంది.ఓవైపు ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించడానికి అధిష్టానం కీలక మంత్రులకు బాధ్యతలను అప్పగించింది. దీంతోపాటు అభ్యర్థి గెలుపు కోసం స్వయంగా ముఖ్యమంత్రి సైతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయా నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలను ఆ జిల్లా కీలక మంత్రులు, ఎమ్మెల్సీ అభ్యర్థి పూర్తిస్థాయి నివేదికను అధిష్టానం వద్ద సమర్పించడం వల్ల అతి తక్కువ శాతం ఓట్లు పోలైన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పై అధిష్టానం దృష్టి సారిస్తుందా, లేక పిలిచి వివరణ అడిగి తెలుసుకుంటుందా అనేది జోరుగా చర్చ సాగుతుండగా ఇప్పటికే ఆ ఎమ్మెల్యేకు అధిష్టానం వద్ద ఆ ఎమ్మెల్యేకు చేదు అనుభవమే ఎదురవుతున్నట్టు తెలుస్తుంది. అయితే మొదటి నుండి జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ నియోజకవర్గ పూర్తి వివరాలను ఇప్పటికే అధిష్టానం నివేదికను తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే చేస్తున్న వ్యవహారాలపై అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :