Monday, 16 June 2025 03:10:20 AM

త్వరలోనే భూమ్మీద అడుగు పెట్టబోతున్న భారత వ్యోమగామి సునీత విలియమ్స్..

Date : 15 March 2025 06:45 PM Views : 340

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలోనే భూమ్మీద అడుగుపెట్టనున్నారు. నాసా-స్పేస్ ఎక్స్‌లు కలిసి చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగామిలతో కూడిన ఫాల్కన్-9 రాకట్ ఈరోజు ఉదయం 4.33 నిమిషాలకు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 2024 జూన్‌లో సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ మిషన్ క్రూ-9 మిషన్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైనర్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు.అయితే వీళ్లు వెళ్లిన రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో… నిక్‌ హేగ్, అలెగ్జాండర్ గోర్పోవ్‌లు తిరిగి భూమి మీదకు వచ్చారు. కానీ, సునీతా విలియమ్స్, బచ్‌ విల్మోర్ అక్కడే ఉండిపోయారు. దాదాపు 9 నెలలుగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లోనే ఉంటున్నారు. అమెరికాలో రెండోసారి అధికారంలోకి రాగానే సునీతా, బచ్‌ని వెన్కక్కి తీసుకురావాలని నాసా-స్పేప్స్‌ను ఆదేశించారు. మూడు రోజుల క్రితమే క్రూ-10 మిషన్‌కు ఏర్పాట్లు చేశారు. దీంతో, సునీత, బచ్ మరో వారం రోజుల్లో భేమి మీదకు వచ్చే అవకాశం ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :