ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : సంప్రదాయ రాజకీయాలకు స్వస్తీ పలికి ఉద్రేక రాజకీయాల వైపు ప్రధాన పార్టీల నేతల ప్రయాణం సాగుతుందన్న భావన సర్వత్రంగా వ్యక్తం అవుతుంది. ఆరోపణలు ప్రత్యరోపణలు చేసుకునే రాజకీయ పార్టీలు మారుతున్న కాలంతో పాటు పార్టీలు కూడా తమ పందాలు మార్చుకున్నట్లుగా కనిపిస్తుంది. ఉద్రేక రాజకీయాలు చేస్తే హీరోయిజంగా భావించే నేటి రాజకీయ వ్యవస్థలో తమ నాయకుడి మెప్పు పొందడానికి చేస్తున్న రాజకీయ విమర్శలు, హద్దులు మీరే మాటలు వ్యక్తిగత జీవితాల వైపు రాజకీయాలు మల్లుతున్నాయనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో కొంత మంది పార్టీల నాయకులు వ్యక్తిగత ప్రతిష్టలకు పోతుండడంతో సమస్యలపై పోరాటాలు చేసే పరిస్థితి కనుమరుగై నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో రామగుండం రాజకీయాలు సాగుతున్నాయని పలువురు మేధావులు భావిస్తున్నారు. సమస్యల సాధన కోసం గొంతెత్తిన స్వరాలకు రాజకీయ విమర్శలు చేస్తుండడం వాళ్ళ ఈ నేపథ్యంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని భావన ఒకానొక సందర్భంలో వ్యక్తం అవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉన్నా అన్నిటికీ భిన్నంగా రామగుండం రాజకీయాలు మాత్రం రసవత్తరంగా చోటు చేసుకుంటున్నాయి. రామగుండంలో రాజకీయ వివాదాలు జడ్యంగా మారుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకులు ఒక విధంగా వాక్యాన్ని ఇస్తే అదే స్థాయిలో ప్రతిపక్షాలు వారు చేసిన ఆరోపణలను తిప్పి కోడుతున్నాయి. ఎవరు అధికారంలో ఉన్న వారి వైపే అధికార యంత్రాంగం ఉంటుందనే భావన అందరిలోనూ సర్వత్రంగా వ్యక్తమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెల రోజులుగా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇసుక. బూడిద. మట్టి. దందాలపై విమర్శలు చేస్తే దీనిని అధికార పార్టీ నాయకులు ఘాటుగానే స్పందించి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు చేసుకునే ఆరోపణలు ప్రత్యారోపణలతో నాయకుల గత చరిత్రను తవ్వుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో పాటు నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగిన మంచి అయిన చెడు ఐన దానిని అనుకూలంగా మార్చుకొని ఆయా పార్టీలకు చెందిన కొంత మంది నేతలు వ్యవహారిస్తున్న తీరు వివాదాలకు నీలయంగా మారుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రామగుండంలో చరిత్రలను గుర్తు చేసుకుంటున్న నేతలు....
ఉద్రిక్త రాజకీయాలకు కేంద్రబిందువుగా రామగుండం రాజకీయాలు సాగుతున్నాయి. ఎక్కడ సంఘటన జరిగిన కొంత మంది నాయకులు మాట్లాడిన మాటలను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో ఇష్టరీతిన తీవ్ర స్థాయిలో పోస్టులు పెడుతుండడంతో రాజకీయ వివాదాల నుండి కుటుంబ వ్యవహారాల దాకా పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. రామగుండంలో కొంత మంది నాయకుల 30 ఏళ్ల చరిత్ర గురించి సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రచారం చేసుకోవడం వ్యక్తిగతంగా తీసుకోవడం రాజకీయ స్థాయిని దిగజార్చుతున్నారనే భావన ప్రజలందరిలో వ్యక్తం అవుతుంది. గత ఏళ్ల రాజకీయ చరిత్రకు ఖాద్దర్ చోక్కా మరకలను నేటి రాజకీయాలకు ముడి పెట్టడం పట్ల ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతుంది. నాయకుల నాటి చరిత్ర పరిస్థితులను తవ్వుకుంటే నేడు ప్రజల్లో ప్రజా వ్యతిరేకకు గురికాక తప్పదనీ పలువురు రాజకీయ మేధావులు భావిస్తున్నారు. ఒక్కొక్కసారి కొంత మంది నాయకులు మాట్లాడిన మాటలను వీడియోలను ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. నాయకుడు ఎవరైనా హద్దులు మీరకుండా ఉండేలా కిందిస్థాయి కార్యకర్తలను నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందనేది పలువురి వాదన.
మారుతున్న రామగుండం రాజకీయాల పరాకాష్ట....
సాంప్రదాయ రాజకీయ విలువలతో ముడిపడిన రామగుండం రాజకీయాలు బూతు రాజకీయంగా వారి చేష్టలు రాజకీయ పరాకాష్టకు దారితీస్తున్నాయి. స్వతంత్ర సమర్థ పాలనలో సర్వం ధార పోసిన ఎంతో మంది మహనీయుల చరిత్రను తిరగరాసీ ఇప్పటికీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకొని వారి రాజకీయ నేపథ్యం ఎంత విలువలతో ఉండేదో అర్థం పట్టే విధంగా చూపించి ప్రజల్లో తమకంటూ సుస్థిర స్థానాన్ని గెల్చుకున్నారు. అలాంటి రాజకీయాలు నేడు కనుమరుగై వివాదాల నిలయంగా నేటి రాజకీయాలు మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామగుండం ఆధిపత్య రాజకీయ పోరులో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సోషల్ మీడియా వేదికగా అరాచకకు రాజకీయ పాలనను కట్టడి చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా పోస్టులు చేసే వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Admin
Aakanksha News